logo

‘అమరావతి నిర్మాణానికి ఇసుక లేకుండా చేస్తారా?’

ఇక అధికారం ఉంటుదో పోతుందో అనే రీతిలో వైకాపా నాయకులు ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 25 Feb 2024 04:57 IST

తుళ్లూరు, న్యూస్‌టుడే : ఇక అధికారం ఉంటుదో పోతుందో అనే రీతిలో వైకాపా నాయకులు ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు శనివారం 1530వ రోజుకు చేరాయి. మందడం శిబిరంలో రైతులు మాట్లాడుతూ పల్నాడు జిల్లా వైకుంఠపురం, తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, బోరుపాలెం రీచ్‌ల నుంచి అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇవి పల్నాడు జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి, తుళ్లూరు మండలానికి చెందిన మరొకరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని ఆరోపించారు. అమరావతి నిర్మాణాలకు ఇసుక లేకుండా వేరే ప్రాంతాలకు తరలించడం దారుణమన్నారు. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు, తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని