logo

జడ్పీ ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యం

మండలాల్లో జిల్లాపరిషత్తు ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యం  ఇవ్వడంతోపాటు అన్యాక్రాంతమైన ఆస్తులు, భూములను గుర్తించి నివేదించాలని జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు.

Published : 25 Feb 2024 04:58 IST

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: మండలాల్లో జిల్లాపరిషత్తు ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యం  ఇవ్వడంతోపాటు అన్యాక్రాంతమైన ఆస్తులు, భూములను గుర్తించి నివేదించాలని జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. శనివారం గుంటూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీవోలతో సీఈవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన క్రిస్టినా మాట్లాడుతూ జిల్లాకు కొత్తగా వచ్చిన ఎంపీడీవోలు మండలాల్లోని జడ్పీ దుకాణాల సముదాయాలు, భూములను లీజుకు తీసుకున్న వారి నుంచి అద్దెలు వసూలు చేయాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ సమయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ప్రొటోకాల్‌ పాటించాలని తెలిపారు. మండలాల్లో ఆడిట్‌ అభ్యంతరాలను పరిష్కరించాలన్నారు. జడ్పీ నిధులతో చేపట్టిన 495 అభివృద్ధి పనులను సకాలంలో పూర్తయ్యేలా దృష్టి సారించాలని వివరించారు. అనంతరం పదోన్నతి పొందిన పరిపాలన అధికారులు, సీనియర్‌ అసిసెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లతో పాటు కారుణ్య నియామక విధానం, బ్యాక్‌లాగ్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులను ఛైర్‌పర్సన్‌ క్రిస్టినా, సీఈవో వసంతరాయుడు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని