logo

ఇసుక అక్రమ దోపిడీ అరికట్టాలి

తెదేపా అధిష్ఠానం పిలుపు మేరకు మండలంలోని బోరుపాలెం వద్దనున్న ఇసుక రీచ్‌లో తెదేపా, జనసేన నాయకులు జెండాలు పట్టుకొని శనివారం నిరసన తెలిపారు.అక్రమ ఇసుక తవ్వకాలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని,

Published : 25 Feb 2024 05:02 IST

బోరుపాలెం ఇసుక రీచ్‌లో నిరసన తెలుపుతున్న తెదేపా నాయకులు

తుళ్లూరు, న్యూస్‌టుడే : తెదేపా అధిష్ఠానం పిలుపు మేరకు మండలంలోని బోరుపాలెం వద్దనున్న ఇసుక రీచ్‌లో తెదేపా, జనసేన నాయకులు జెండాలు పట్టుకొని శనివారం నిరసన తెలిపారు.అక్రమ ఇసుక తవ్వకాలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని, ఇసుక దొంగలను అరెస్టు చేయాలని, ఇసుక దోపిడీని అరికట్టలేని ప్రభుత్వం దిగిపోవాలని నినాదాలు చేశారు. అనంతరం తుళ్లూరు తహసీల్దార్‌ సుధీర్‌, సీఐ సుభానీలకు వినతిపత్రాలు సమర్పించారు. తెదేపా మండల అధ్యక్షుడు ధనేకుల వెంకట సుబ్బారావు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు పుట్టి రామచంద్రరావు మాట్లాడుతూ అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు వేల కోట్ల రూపాయల ఇసుకను తవ్వి అమ్ముకున్నారని ఆరోపించారు. వైకాపా నాయకుల చేస్తున్న ఇసుక మాఫీయాను అధికారులు అడ్డుకుని కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దామినేని శ్రీనివాసరావు, మైనేని గిరిజ, కాటా అప్పారావు, కొమ్మినేని కోటేశ్వరావు, మూల్పూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని