logo

తెదేపా ఫ్లెక్సీల తొలగింపు అడ్డగింత

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలను భరత్‌రెడ్డి యూత్‌ మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేస్తుండగా నగరపాలక అధికారులు అడ్డుకోవడంతో తెదేపా శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Published : 25 Feb 2024 05:03 IST

పోలీసులతో మాట్లాడుతున్న తెదేపా నేత శ్రీనివాసరావు తదితరులు

మంగళగిరి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలను భరత్‌రెడ్డి యూత్‌ మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేస్తుండగా నగరపాలక అధికారులు అడ్డుకోవడంతో తెదేపా శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. నగర శివార్లలోని గౌతమబుద్ధా రోడ్డులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ప్రణాళికా విభాగానికి చెందిన అధికారులు వాటిని తొలగించాలంటూ సూచించారు. ఇందుకు పార్టీ నాయకులు నిరాకరించారు. వారు మాట్లాడుతూ అధికార పార్టీకి దాసోహం చేస్తూ తెదేపా ఫ్లెక్సీలను తొలగిస్తున్నారన్నారు. తొలగింపు గురించి కమిషనర్‌తో మాట్లాడుకోవాలని ప్రణాళికా అధికారులు సూచించడంతో ఆయన్నే రమ్మంటూ పార్టీ సభ్యులు బదులిచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. వివాదం ముదరడంతో అధికారులు తొలగించిన ఫ్లెక్సీలను తిరిగి ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని