logo

‘అధికారుల నిర్ణయంతో లక్షల మంది రోడ్డున పడ్డారు’

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా లక్షమంది ల్యాబ్‌ టెక్నీషీయన్ల, పరోక్షంగా మరో రెండు లక్షల మంది రోడ్డున పడ్డారని జిల్లా ల్యాబ్‌, ఎక్స్‌రే ఓనర్స్‌ అషోసియేషన్‌ అధ్యక్షుడు ఆనం సంజీవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 25 Feb 2024 06:47 IST

మంత్రి రజినికి వినతిపత్రం అందజేస్తున్న సంజీవరెడ్డి, మూర్తి, శ్రీహరి తదితరులు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా లక్షమంది ల్యాబ్‌ టెక్నీషీయన్ల, పరోక్షంగా మరో రెండు లక్షల మంది రోడ్డున పడ్డారని జిల్లా ల్యాబ్‌, ఎక్స్‌రే ఓనర్స్‌ అషోసియేషన్‌ అధ్యక్షుడు ఆనం సంజీవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డయాగ్నోకాన్‌-2024 పేరుతో గుంటూరులోని ఎల్‌వీఆర్‌ క్లబ్‌లో శనివారం రాత్రి జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రతి ల్యాబ్‌లో పెథాలజిస్ట్‌ ఉండాలనే నిబంధనతో వైద్యాధికారులు తమను వేధిస్తున్నారని తెలిపారు. ఉత్తర భారతదేశంలో ఓ న్యాయస్థానంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా మన రాష్ట్రంలోనూ తమను అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి మాట్లాడుతూ బేసిక్‌ పరీక్షల నిర్వహణ కోసమే తాము లైసెన్స్‌లు తీసుకున్నామన్నారు. ఈ పరీక్షలను కూడా నూరుశాతం కచ్చితత్వంతో ఇచ్చే యంత్రాలను వాడుతున్నామన్నారు. అందువల్ల తాము నిర్వహించే ల్యాబ్‌ల్లో ఇచ్చే నివేదికలతో రోగులకు ఇబ్బంది ఉండదన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ సమస్యను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తమ సమస్యలపై మంత్రి రజినికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో విజయలక్ష్మి, ఆ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీహరి, వివిధ జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని