logo

మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న జగన్‌ను ఇంటికి సాగనంపాలి

మూడు రాజధానుల నిర్ణయం తీసుకొని అమరావతిని నాశనం చేసిన జగన్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

Published : 25 Feb 2024 05:07 IST

తెదేపా జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌

శ్రావణ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న కోవెలమూడి రవీంద్ర తదితరులు

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: మూడు రాజధానుల నిర్ణయం తీసుకొని అమరావతిని నాశనం చేసిన జగన్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. తెనాలి శ్రావణ్‌కుమార్‌కు తాడికొండ నియోజకవర్గం సీటును కేటాయించిన సందర్భంగా జిలా పార్టీ కార్యాలయంలో తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. శ్రావణ్‌కుమార్‌కు పలువురు తెదేపా నాయకులు  మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. బాణసంచా కాల్చారు. శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ మాఘ పౌర్ణమి మంచిరోజున, శుభ ముహూర్తాన తెదేపా-జనసేన అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేయడం శుభ పరిణామం. రాజధాని అమరావతి నియోజకవర్గమైన తాడికొండ సీటును నాకు కేటాయించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు. అమరావతిపై కక్ష గట్టిన జగన్‌ మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని పిచ్చి నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమించిన మహిళలపై కర్కశంగా వ్యవహరించారు. సుచరిత హోం మంత్రిగా ఉన్న సమయంలోనే అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని మహిళల పట్ల పోలీసులు గూండాల్లా వ్యవహరించారు. శాంతియుతంగా ఉద్యమిస్తున్న మహిళలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఎన్నికల్లో సుచరిత తాడికొండ నుంచే పోటీ చేస్తున్నారు. ఆమెను చిత్తుచిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలి. గుంటూరు జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గంతోపాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తెదేపా ఘన విజయం సాధించడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని