logo

కల్లాల్లో ఆరబోసిన 5 క్వింటాళ్ల మిర్చి చోరీ

వెల్లటూరు రోడ్డులోని గుడ్‌ షెపర్డ్‌ పాఠశాల వెనుక పొలంలో ఆరబెట్టిన 5 క్వింటాళ్ల మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి దొంగిలించారని రైతు నకరికంటి చిన్న ఖాసిం తెలిపారు.

Published : 25 Feb 2024 05:10 IST

బాధితుడిని పరామర్శిస్తున్న రైతు సంఘం నేతలు

వినుకొండ రూరల్‌, న్యూస్‌టుడే : వెల్లటూరు రోడ్డులోని గుడ్‌ షెపర్డ్‌ పాఠశాల వెనుక పొలంలో ఆరబెట్టిన 5 క్వింటాళ్ల మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి దొంగిలించారని రైతు నకరికంటి చిన్న ఖాసిం తెలిపారు. బాధితుడి వివరాల మేరకు మూడెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంటను సాగు చేశారు. తొలి కోతలో వచ్చిన 12 క్వింటాళ్ల తేజ రకం మిర్చిని కల్లంలో ఆరబెట్టారు. రాత్రి 11 గంటల వరకు కాపలాఉండి తరువాత ఆయన ఇంటికి వెళ్లాడు. వేకువనే పొలం వద్దకు రాగా, సుమారు 5 క్వింటాళ్లకు పైగా చోరీ చేశారని బాధితుడు వాపోయాడు. సమాచారం తెలిసి ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాము రైతును పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు రాత్రిపూట గస్తీ ఏర్పాటు చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని