logo

ప్రత్తిపాటి శరత్‌ను విడుదల చేసేవరకు విశ్రమించం

మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ బాబు అరెస్టును నిరసిస్తూ తెదేపా, జనసేన శ్రేణుల ఆందోళనలు రెండోరోజు శుక్రవారం కొనసాగాయి.

Published : 02 Mar 2024 05:13 IST

అరెస్టును నిరసిస్తూ తెదేపా, జనసేన శాంతి ర్యాలీ

 తెదేపా, జనసేన ఆధ్వర్యంలో శాంతియుత ప్రదర్శన

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ బాబు అరెస్టును నిరసిస్తూ తెదేపా, జనసేన శ్రేణుల ఆందోళనలు రెండోరోజు శుక్రవారం కొనసాగాయి. అక్రమంగా అరెస్టు చేసిన ప్రత్తిపాటి శరత్‌ను విడుదల చేసేవరకు విశ్రమించేది లేదని నేతలు, కార్యకర్తలు నినదించారు. చిలకలూరిపేటలో శుక్రవారం నల్లబ్యాడ్జీలతో తెదేపా కార్యాలయం వద్ద నుంచి ఎన్టీఆర్‌ సెంటర్‌ మీదుగా రైతు బజారు వద్ద ఉన్న గాంధీ విగ్రహం వరకు శాంతిర్యాలీ చేపట్టారు. సీఎం జగన్‌, వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేశారు. శరత్‌పై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైకాపా చెప్పినట్లల్లా ఆడే అధికారులకు అడ్డు పెట్టుకుని ప్రత్తిపాటి కుటుంబంపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ కక్ష సాధింపు రాజకీయాల గురించి ముందే తెలిసిన ప్రజలెవరూ ఈ తప్పుడు ప్రచారాలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఓటమి భయంతో ఇలా చేతుల్లో అధికారం ఉంది కదా.. అంటూ అక్రమ నిర్బంధాలకు తెగబడతారా అంటూ ప్రశ్నించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని