logo

ఎన్నికల కోడ్‌ వచ్చేలోగా తెదేపా నేతలపై కేసులే వ్యూహం : ఉమ

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ వచ్చే లోగా తెదేపాకు చెందిన 20 మంది నేతలపై అక్రమ కేసులు పెట్టాలన్న లక్ష్యంతో జగన్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు

Published : 02 Mar 2024 05:17 IST

మాట్లాడుతున్న మాజీమంత్రి దేవినేని ఉమ, పక్కన అరవిందబాబు

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే : రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ వచ్చే లోగా తెదేపాకు చెందిన 20 మంది నేతలపై అక్రమ కేసులు పెట్టాలన్న లక్ష్యంతో జగన్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. నరసరావుపేటలో తెదేపా కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెదేపా- జనసేన ప్రభుత్వం వచ్చేది ఖాయమని, తాడేపల్లిగూడెంలో జెండా సభకు వచ్చిన ఆదరణ చూసి తట్టుకోలేక జగన్‌రెడ్డి ఇలాంటి ఆరాచకాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. మాజీ మంత్రి నారాయణ కళాశాలలు, సంస్థలపై దాడులు చేశారన్నారు. ప్రతిపాటి పుల్లారావుకు కుమారుడు శరత్‌ను ఉగ్రవాదిని పట్టుకున్నట్లు అరెస్ట్‌ చేసి విజయవాడలోని అన్ని స్టేషన్లకు తిప్పారన్నారు. వైకాపా ఆకృత్యాలకు బదులు చెప్పేందుకు రా కదలిరా సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర వైద్య విభాగం ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని