logo

ఇదో ఆటవిక రాజ్యం!

రాష్ట్రంలో తెదేపా ఫ్లెక్సీల చించివేత అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏ నియోజకవర్గంలో చూసినా ఇవే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

Updated : 02 Mar 2024 05:49 IST

రాష్ట్రంలో తెదేపా ఫ్లెక్సీల చించివేత అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏ నియోజకవర్గంలో చూసినా ఇవే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై నివాసం ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌ ఫ్లెక్సీలను చించివేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కొండవీటి వాగు నుంచి చంద్రబాబు నివాసం వరకు కరకట్ట పొడవునా ఇరువైపులా తెదేపా, వైకాపా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల కిందట రాత్రి సమయంలో కరకట్టపై కర్రలతో తిరుగుతూ యువకులు తెదేపా ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. గురువారం రాత్రి మరికొన్ని ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. వైకాపా ఫ్లెక్సీలు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి.

- ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని