logo

ట్రావెల్స్‌ బస్సు బీభత్సం

నామ్‌ రహదారిపై అద్దంకి బంగ్లా రోడ్డు వద్ద రెండు ద్విచక్రవాహనాలు, గోపాలపురం వద్ద నాలుగు చక్రాల ఆటోను ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది.

Published : 22 Apr 2024 04:25 IST

రెండు ద్విచక్ర వాహనాలు, లారీ, ఆటోను ఢీకొన్న వైనం
మద్యం మత్తులో చోదకుడు

అద్దంకి, న్యూస్‌టుడే : నామ్‌ రహదారిపై అద్దంకి బంగ్లా రోడ్డు వద్ద రెండు ద్విచక్రవాహనాలు, గోపాలపురం వద్ద నాలుగు చక్రాల ఆటోను ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహన చోదకులతో పాటు నాలుగు చక్రాల ఆటోలో ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం అద్దంకి పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ పి.కృష్ణయ్య అందించిన సమాచారం మేరకు సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన బి.యోహాను రేపల్లెకు చెందిన ట్రావెల్స్‌ బస్సు చోదకుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఖాళీ బస్సును మేదరమెట్ల మీదుగా ఏల్చూరు తీసుకెళ్తున్నాడు. పూటుగా మద్యం సేవించిన ఉన్న బస్సు చోదకుడు అద్దంకి సత్యనారాయణ కళామందిర్‌ వద్ద రెండు ద్విచక్రవాహనాలను, లారీని ఢీకొట్టాడు. ఇద్దరు ద్విచక్రవాహనాల చోదకులు కిందపడి గాయపడ్డారు. అంతటితో ఆగక బస్సును ముందుకు పోనిచ్చి గోపాలపురం వద్ద నాలుగు చక్రాల ఆటోను ఢీకొట్టాడు. దానిలో ప్రయాణిస్తున్న అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు పాలెపోగు శ్రీనివాసరావు, వేణుగోపాల్‌కు గాయాలయ్యాయి. అంతటితో ఆగక బస్సును విభాగినిపై ఎక్కించడంతో బస్సు కదల్లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును వెంబడించి చోదకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని