logo

వైకాపా కార్యకర్త మృతి కేసులో ఇద్దరు యువకుల అరెస్టు

తాడేపల్లి సీఎస్‌ఆర్‌ కల్యాణ మండపం ప్రాంతంలో ఈ నెల 19వ తేదీ రాత్రి ద్విచక్రవాహనం ఢీకొని వైకాపా కార్యకర్త వెంకటరెడ్డి మృతి చెందారు.

Published : 22 Apr 2024 04:25 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: తాడేపల్లి సీఎస్‌ఆర్‌ కల్యాణ మండపం ప్రాంతంలో ఈ నెల 19వ తేదీ రాత్రి ద్విచక్రవాహనం ఢీకొని వైకాపా కార్యకర్త వెంకటరెడ్డి మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు గురువర్థన్‌, బాలఈశ్వర్‌ అనే యువకులను సీఐ కల్యాణ్‌రాజ్‌ అరెస్టు చేశారు.

‘అన్యాయంగా బీసీ విద్యార్థులను ఇరికిస్తే ఊరుకోం’

తాడేపల్లి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో వైకాపా కార్యకర్త వెంకటరెడ్డి మృతి చెందితే దాన్ని రాజకీయం చేసి బీసీ విద్యార్థులను ఇరికించాలని చూస్తే ఊరుకోమని ఆంధ్రప్రదేశ్‌ యాదవ సంఘం, ఓబీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఓబీసీ జాతీయ అధ్యక్షుడు వరప్రసాద్‌ యాదవ్‌, రాష్ట్ర అధ్యక్షుడు కుర్ర శ్రీనివాసరావు యాదవ్‌ తాడేపల్లి పోలీసుస్టేషన్‌ వద్ద ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ వెంకటరెడ్డి మృతి చెందడంపై విచారణ వ్యక్తం చేస్తున్నామన్నారు. పూర్తిస్థాయి విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. అమాయకులపై రాజకీయ ఒత్తిళ్లతో వివిధ సెక్షన్ల కింద కేసులు చేశారని ఆరోపించారు. విద్యార్థులను ఇరికిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. బీసీ వర్గాల మనోభావాలు దెబ్బతీస్తే డీజీపీ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని