logo

ఈసీ నిబంధనల మేరకే పోస్టల్‌ బ్యాలెట్‌

పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శివశంకర్‌ అన్నారు.

Published : 22 Apr 2024 04:34 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ శివశంకర్‌

నరసరావుపేట అర్బన్‌: పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శివశంకర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం నియోజకవర్గ ఆర్వోలతో వెబెక్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న వారికి పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తులు అందించేందుకు 26 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లో ఓట్లు ఉన్న వారికి అమరావతిలోని సచివాలయంలో మూడు ఎక్ఛేంజీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానికంగా ఓట్లు ఉన్న ఎన్నికల సిబ్బంది, అత్యవసర సేవల్లో ఉండేవారు పోస్టల్‌ బ్యాలెట్‌కు అర్హులని తెలిపారు. ఆర్వో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ల వద్ద దరఖాస్తులు అందజేయాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ మే 5, 6, 7 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. 5న పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారులు, సూక్ష్మపరిశీలకులు, 6న పోలీస్‌ సిబ్బంది, 7న అత్యవసర సేవల ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. జిల్లా వెలుపల ఓటర్లుగా ఉన్న ఉద్యోగులు అమరావతి సచివాలయంలో 28న ఓటర్ల మార్పిడికి సంబంధించి ఫారం- 12 సమర్పించాలన్నారు.  శిక్షణ కలెక్టర్‌ కల్పశ్రీ, డీఆర్వో వినాయకం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని