logo

ఐదేళ్ల నిర్లక్ష్యానికి ఈ దారే సాక్ష్యం

గుంటూరు జిల్లా తెనాలి బాపట్ల జిల్లా చందోలు మధ్య ప్రధాన రహదారి అమృతలూరు మండలంలో పలుచోట్ల ప్రమాదకరంగా మారింది.

Published : 22 Apr 2024 04:38 IST

కోతకు గురైన రహదారి

గుంటూరు జిల్లా తెనాలి బాపట్ల జిల్లా చందోలు మధ్య ప్రధాన రహదారి అమృతలూరు మండలంలో పలుచోట్ల ప్రమాదకరంగా మారింది. మండల ప్రజలు దీనిపై తెనాలికి రాకపోకలు సాగిస్తుంటారు. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను పట్టణాల్లోని మార్కెట్‌యార్డుకు ఇటుగానే తరలిస్తారు. రహదారి గుంతలు, అంచులు పల్లంగా మారడంతో వాహనాలు ఎదురైన సందర్భంలో తప్పుకోవాలంటే తంటాలు పడాల్సిందే. ప్రధానంగా పెదపూడి -మండూరు వంతెనల మధ్య రహదారి ఛిద్రమైంది. ఈప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయినా ప్రజాప్రతినిధులు, అధికారులు శాశ్వత ప్రాతిపదికన రహదారిని అభివృద్ధి చేయలేదు. బస్సు సర్వీసులను సైతం కూచిపూడి గ్రామం నుంచి దారి మళ్లించి రాకపోకలు సాగిస్తున్నారు. రహదారి కోతకు గురికావడం, అంచులు పూర్తిగా పల్లంగా ఉండడంతో ద్విచక్రవాహనదారులు గాయాలపాలైన సంఘటనలు చాలా ఉన్నాయి. గతేడాది మొక్కజొన్న ఉత్పత్తులతో వెళుతున్న రెండు లారీలు పక్కకు పడిపోయాయి. రెండేళ్ల క్రితం ప్రభుత్వ మద్యం వాహనం ఏకంగా కాల్వలోకి దూసుకెళ్లింది. గడ్డి ట్రాక్టర్లు ఈప్రాంతంలో తరచూ పడిపోతున్నాయి.

న్యూస్‌టుడే, అమృతలూరు

కూచిపూడి లాకుల కూడలిలో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని