logo

HYD News: రూపురేఖలు మారనున్న సిటీ బస్సు ప్రయాణం.. హైదరాబాద్‌కు 125 డీలక్స్‌ బస్సులు

నగరంలో సిటీ బస్సు ప్రయాణం రూపురేఖలు మారనున్నాయి.

Updated : 25 May 2024 09:59 IST

జులైనాటికి సర్వీసులు అందుబాటులోకి..

ఈనాడు- హైదరాబాద్‌: నగరంలో సిటీ బస్సు ప్రయాణం రూపురేఖలు మారనున్నాయి. తాజాగా 25 ఎలక్ట్రిక్‌ ఏసీ, 25 నాన్‌ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు నగరానికి రాగా.. మరో 450 ఎలక్ట్రిక్‌ బస్సులు జులై నాటికి రోడ్డెక్కనున్నాయి. మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం 125 డీలక్స్‌ బస్సులను సమకూర్చుతోంది. ఇవి జులైలో అందుబాటులోకి వస్తాయి.

అన్ని మార్గాల్లో.. నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లో డీలక్స్‌ బస్సులు నడపనున్నారు. సిటీ, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్నాయి. సౌకర్యవంతంగా వెళ్లాలనుకునే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని అందుబాటులోకి తెస్తున్న డీలక్స్‌ బస్సుల్లో అందరూ టిక్కెట్‌ తీసుకోవాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని