logo

Hyderabad: రాయదుర్గం ఐటీ ఫీల్డ్‌లో పోకిరీల హల్‌చల్‌

వారంతాలు.. అర్ధరాత్రి వేళ రాయదుర్గం టీహబ్‌ రోడ్లు, ఐటీ క్షేత్రంలోని రహదారులు బైకు రేసులు, విన్యాసాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. నగరం నలమూలల నుంచి భారీగా బైకర్లు గుంపులుగా చేరుకుని వాహనాలను మెరుపు

Updated : 27 May 2024 10:31 IST

ఒకరికొకరు పోటాపోటీగా..

రాయదుర్గం, న్యూస్‌టుడే: వారంతాలు.. అర్ధరాత్రి వేళ రాయదుర్గం టీహబ్‌ రోడ్లు, ఐటీ క్షేత్రంలోని రహదారులు బైకు రేసులు, విన్యాసాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. నగరం నలమూలల నుంచి భారీగా బైకర్లు గుంపులుగా చేరుకుని వాహనాలను మెరుపు వేగంతో నడిపించడమేకాక విన్యాసాలూ చేస్తుంటారు. పోలీసుల నిఘా అంతంత మాత్రంగా ఉండడంతో పోకిరీల జోరుకు కళ్లెం పడడంలేదు.

రాయదుర్గం ఐటీ క్షేత్రంలో ముఖ్యంగా టీహబ్‌ రోడ్లలో ఈ రేసులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి జనసంచారం పూర్తిగా తగ్గిపోగానే బైకర్లకు పందేలు కాస్తుంటారు. వేగంగా నడిపే క్రమంలో అదుపు తప్పితే అక్కడి డివైడర్లు, ఫుట్‌పాత్‌లకు తగిలి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.  

అంతంత మాత్రంగా పెట్రోలింగ్‌.. టీహబ్‌ ఎదుట ఉన్న రోడ్డుపై అర కిలోమీటరు దూరం రేసులకు వాడుకుంటారు. అరబిందో గెలాక్సీ ముందున్న రోడ్డును, రెండు గుట్టల మధ్య నుంచి హైహోం భుజా వరకున్న రేసులు సాగుతుంటాయి. ఆ రోడ్లు విశాలంగా ఉంటాయి. వారాంతాల్లో ఈ బైకు రేసులు నిర్వహిస్తుంటారు. పోలీస్‌ పెట్రోలింగ్‌ అంతంత మాత్రంగా ఉండడంతో పోకిరీలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. 

పోలీసుల ముందే కార్లు, బైక్‌ల రేసింగ్‌, రాంగ్‌రూట్‌లో విన్యాసాలు 


కేసులు నమోదు చేస్తాం
వెంకన్న, ఇన్‌స్పెక్టర్, రాయదుర్గం

బైకు రేసులను కట్టడి చేసేందుకు గస్తీని మరింత పటిష్ఠం చేస్తాం.. బైకర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేస్తాం. వాహనాలను సీజ్‌ చేసి ఆర్టీఏకు అప్పగిస్తాం. మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులపై కేసు నమోదుచేస్తాం. రేసులు నిర్వహించకుండా టీహబ్‌ రోడ్లపై నిర్ణీత దూరాల్లో టీఎస్‌ఐఐసీ ద్వారా వేగ నిరోధకాలు ఏర్పాటు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు