logo

Cheating: క్యూఆర్‌ కోడ్‌ మార్చేసి రూ.4 కోట్లు స్వాహా

ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే ఉద్యోగులు క్యూఆర్‌ కోడ్‌లు మార్చేసి రూ.4.15 కోట్లు కొట్టేశారు. నగరంలోని కొండాపూర్‌లో ఇస్తారా పార్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ‘కోలివింగ్‌ ప్రాపర్టీస్‌’ పేరుతో ఒంటరిగా ఉండే ఉద్యోగుల కోసం అద్దె గృహాలు నిర్వహిస్తోంది.

Updated : 26 May 2024 07:28 IST

ఈనాడు- హైదరాబాద్‌: ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే ఉద్యోగులు క్యూఆర్‌ కోడ్‌లు మార్చేసి రూ.4.15 కోట్లు కొట్టేశారు. నగరంలోని కొండాపూర్‌లో ఇస్తారా పార్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ‘కోలివింగ్‌ ప్రాపర్టీస్‌’ పేరుతో ఒంటరిగా ఉండే ఉద్యోగుల కోసం అద్దె గృహాలు నిర్వహిస్తోంది. ఇందులో పనిచేసే ఉద్యోగులు.. వినియోగదారులు డిజిటల్‌ విధానంలో చెల్లించే సొమ్మును సంస్థ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా మాత్రమే స్వీకరించాలి. ఇవి నేరుగా సంస్థ బ్యాంకు ఖాతాలో జమవుతాయి. 15 మంది ఉద్యోగులు మాత్రం  వ్యక్తిగత బ్యాంకులకు సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌కు చెల్లించాలని సూచించేవారు. ఇలా కొన్ని నెలల వ్యవధిలో రూ.4.15 కోట్లు సొంత ఖాతాల్లోకి మళ్లించారు. ఆడిట్‌ నిర్వహిస్తున్న సమయంలో ఈ మోసం బయటపడింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈవోడబ్ల్యూ పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని