logo

Hyd News: బిగ్‌బాస్కెట్‌లో గడువుతీరిన వస్తువులు

ఇంటింటికి కూరగాయలు, ఇతర నిత్యావసరాలను అందించే బిగ్‌బాస్కెట్‌ మొబైల్‌ యాప్‌నకు సంబంధించిన కొండాపూర్‌ మసీద్‌బండ ప్రాంతంలోని గోదాములో తనిఖీలు నిర్వహించగా గడువు తీరిన మసాలాలు, ఇతర వస్తువులు లభ్యమైనట్లు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల టాస్క్‌ఫోర్స్‌ బృందం శుక్రవారం ప్రకటనలో తెలిపింది.

Updated : 25 May 2024 07:14 IST

గోదాముకు తాళం వేసిన అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటింటికి కూరగాయలు, ఇతర నిత్యావసరాలను అందించే బిగ్‌బాస్కెట్‌ మొబైల్‌ యాప్‌నకు సంబంధించిన కొండాపూర్‌ మసీద్‌బండ ప్రాంతంలోని గోదాములో తనిఖీలు నిర్వహించగా గడువు తీరిన మసాలాలు, ఇతర వస్తువులు లభ్యమైనట్లు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల టాస్క్‌ఫోర్స్‌ బృందం శుక్రవారం ప్రకటనలో తెలిపింది. చికెన్‌ మసాలా, సాస్‌లు, పిజ్జా చీజ్, పనీర్, ఐస్‌క్రీమ్‌లు, బాదం మిఠాయి వంటి గడువు తీరిన పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామని అధికారులు వెల్లడించారు. నూనెతో తడిసిన నిత్యావసరాలు, సరిగా భద్రపరచని డెయిరీ వస్తువులు, ఇతరత్రా ఉల్లంఘనలను గుర్తించి నోటీసు ఇచ్చామని, గోదాము లైసెన్సును రద్దు చేశామని స్పష్టం చేశారు.

 గడువు తీరిన పాల ప్యాకెట్లు

రామేశ్వరం కేఫ్‌లోనూ..

మాదాపూర్‌ రామేశ్వరం కేఫ్‌లో మార్చి నెలలో గడువు ముగిసిన వంద కేజీల మినప పప్పు సంచులను, పెరుగు, పాల ప్యాకెట్లను గుర్తించి, అక్కడికక్కడే ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. సవ్యంగా భద్రపరచని బియ్యం, బెల్లం, ఇతరత్రా ఉల్లంఘనలను గుర్తించామని, సరిచేసుకోవాలని తెలుపుతూ నోటీసు ఇచ్చామని వెల్లడించారు. మాదాపూర్‌లోని బాహుబలి కిచెన్‌లో అధిక మోతాదులో రంగు కలిపిన ఆహార పదార్థాలు, బొద్దింకలతో కలిసిపోయిన ఆహార పదార్థాలను, ఇతర అనారోగ్యకర వాతావరణాన్ని గుర్తించి, తగు చర్యలు తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు