logo

Vegetables: కూరగాయల కొరతతో ధరల మోత.. ఒక్కసారిగా రెట్టింపు

అకాల వర్షాలు.. రబీ-ఖరీఫ్‌ అంతరంతో కూరగాయల సాగు తగ్గిపోయింది. ఇదే అదనుగా ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.ముందస్తు ప్రణాళికలు ఉన్నా ఆచరణలో విఫలం కావడంతో ప్రజల నడ్డి విరిచేలా భారం పెరుగుతోంది. మొన్నటి దాకా రూ.వందకు 6 కేజీల టమాటా దొరికేది.

Updated : 29 May 2024 09:12 IST

రబీ - ఖరీఫ్‌ మధ్య  పెరిగిన అంతరం

ఈనాడు, హైదరాబాద్‌: అకాల వర్షాలు.. రబీ-ఖరీఫ్‌ అంతరంతో కూరగాయల సాగు తగ్గిపోయింది. ఇదే అదనుగా ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.ముందస్తు ప్రణాళికలు ఉన్నా ఆచరణలో విఫలం కావడంతో ప్రజల నడ్డి విరిచేలా భారం పెరుగుతోంది. మొన్నటి దాకా రూ.వందకు 6 కేజీల టమాటా దొరికేది. ఇప్పుడు రైతుబజారులోనే రూ.30 దాటింది. బయట మార్కెట్లో రూ.40-50 ఉంటోంది. ఇక బీన్స్‌ రూ. 200లు దాటింది. బీర, సొరకాయలు రూ.60కిపైగానే ఉంటున్నాయి.

తగ్గిన సరఫరా

జాతీయ పోషకాహార సంస్థ లెక్కల ప్రకారం కనీసం ప్రతి రోజూ ప్రతి ఒక్కరు.. 350 గ్రా. కూరగాయలు తినాలి. ఈ లెక్కన రోజుకు 3300 టన్నులు నగరానికి కూరగాయలు అవసరం.. నగరంలోని అన్ని హోల్‌సేల్‌ మార్కెట్లకు 2800 టన్నులు మాత్రమే వస్తున్నాయి. ప్రతి రోజూ 5 వేల క్వింటాళ్ల టమాటా వస్తే ధర కాస్త అందుబాటులో ఉంటోంది. ఇప్పుడు 4 వేల క్వింటాళ్లలోపే రావడంతో ధర పెరిగింది. రైతుబజారు ధర ప్రకారం కిలో టమాటా రూ.31.. గుండు బీన్స్‌ ధర రూ. 155. గింజ చిక్కుడు రూ.85, పచ్చకాకర రూ.55లు, బెండకాయ రూ.45, పచ్చి మిర్చి రూ. 50 ఉంటే..బహిరంగ మార్కెట్‌లో రూ.10-20 అధికంగా ఉంటోంది.

ఖరీఫ్‌ పంట వస్తేనే..

ఖరీఫ్‌ పంట కాలం జూన్‌ నెల నుంచి మొదలవుతుంది. వర్షాలు వస్తే కూరగాయల సాగు సాధ్యమవుతుంది. ఆ తర్వాతే కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని