logo

ఆరా తీసేందుకు లోరా

మహానగర వ్యాప్తంగా జరుగుతున్న నీటి సరఫరా మొదలుకొని.. మ్యాన్‌హోళ్లపై పర్యవేక్షణ, రిజర్వాయర్లపై నిఘా.. ఇలా అన్ని అంశాలను సరికొత్త సాంకేతికతతో జలమండలి పర్యవేక్షించనుంది.

Published : 31 Jan 2023 04:10 IST

నీటి మీటర్లు, రిజర్వాయర్లు, ఇతర సేవలన్నింటిపై జలమండలి నిఘా

సమాచారం అందించే టవర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మహానగర వ్యాప్తంగా జరుగుతున్న నీటి సరఫరా మొదలుకొని.. మ్యాన్‌హోళ్లపై పర్యవేక్షణ, రిజర్వాయర్లపై నిఘా.. ఇలా అన్ని అంశాలను సరికొత్త సాంకేతికతతో జలమండలి పర్యవేక్షించనుంది. లో రేంజ్‌ వైడ్‌ ఏరియా నెట్‌ వర్క్‌(లోరా)తో ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఏవోటీ) ఆధారంగా ఇప్పటి వరకు జరుగుతున్న నష్టాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. తొలిదశలో 4 వేల ఏఎంఆర్‌ నీటి మీటర్లను ఈ నెట్‌వర్క్‌ పరిధిలోకి తెచ్చేందుకు పనులు జరుగుతున్నాయి. ఇందుకు నగరవ్యాప్తంగా ప్రత్యేక టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కోటి రూ.1.5 లక్షల వరకు ఖర్చుతో 113 ప్రాంతాల్లో టవర్ల నిర్మాణం పూర్తిచేసి 1700 మీటర్లను అనుసంధానం చేశారు. నాలుగు నెలల్లోనే మంచి ఫలితాలు కనిపించాయి. దాదాపు 20-25 శాతం ఆయా బల్క్‌ మీటర్లతో ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు. ఇక రిజర్వాయర్ల ఓవర్‌ ఫ్లో, మ్యాన్‌హోళ్ల పర్యవేక్షణ తదితర అన్ని రకాల సేవలకు ఈ టెక్నాలజీని వాడుకోనున్నారు.


ఇవీ ఉపయోగాలు

* ఏఎంఆర్‌ మీటర్లు ఉండే ప్రాంతంలో ఒక ప్రత్యేక టవర్‌ ఏర్పాటు చేస్తారు. ఒక్క టవర్‌ పరిధిలో 200 మీటర్లు అనుసంధానం చేయవచ్చు. మీటర్‌ వద్ద ఉండే సెన్సార్లు ఇచ్చే సిగ్నళ్లు టవర్లకు చేరి అక్కడ నుంచి ఖైరతాబాద్‌ ప్రధాన కార్యాలయంలోని స్కాడాకు చేరుస్తాయి. టాంపరింగ్‌ చేస్తే రెడ్‌ మార్క్‌తో స్కాడాలో పర్యవేక్షణ సిబ్బందికి సమాచారం అందుతుంది. 

* పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక సంస్థల్లో మీటర్లు పనిచేయకపోయినా, టాంపరింగ్‌ చేసినా జలమండలికి రూ.కోట్లలో నష్టం వస్తుంది. కొత్త సాంకేతికతతో అలాంటి ఇబ్బందులు నివారించవచ్చు. మ్యాన్‌హోళ్లు పొంగినా రిజర్వాయర్లు ఓవర్‌ ఫ్లో అయినా సెన్సార్లు సమాచారం అందిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని