logo

‘సచివాలయ నిర్మాణంలో వేగం.. ఆసుపత్రి పనుల్లో జాప్యం’

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో వైద్యరంగానికి 8శాతం నిధులు కేటాయించాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated : 01 Feb 2023 05:47 IST

ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన స్థలంలో వేప మొక్కను నాటుతున్న కాంగ్రెస్‌ నాయకులు

చైతన్యపురి, న్యూస్‌టుడే: ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో వైద్యరంగానికి 8శాతం నిధులు కేటాయించాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎల్‌బీనగర్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మల్‌రెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి చల్లా నర్సింహారెడ్డి,  జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి తదితరులు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ స్థలంలో  ఆసుపత్రి నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సచివాలయాన్ని, కలెక్టరేట్ల భవన సముదాయాలను ఆగమేఘాల మీద నిర్మిస్తున్న ప్రభుత్వం, పేదలకు అవసరమైన ఆసుపత్రుల నిర్మాణంలో జాప్యం  చేయడం ఏమిటని ప్రశ్నించారు. పండ్ల మార్కెట్‌ను శివారుకు తరలించడంతో వసతులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వెంటనే ఆసుపత్రి పనులు చేపట్టాలని కోరారు. సీఎం కేసీఆర్‌ పండ్ల మార్కెట్‌ స్థలంలో ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన చోట కాంగ్రెస్‌ నాయకులు వేప మొక్కను నాటారు. అంతకుముందు పండ్ల మార్కెట్‌ స్థలంలోకి కాంగ్రెస్‌ నేతలు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నాయకులు చైతన్యపురి కూడలి నుంచి ర్యాలీగా వచ్చి లోనికి దూసుకెళ్లారు. రోహన్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు