logo

ఉద్యోగ ఖాళీల భర్తీకి కేంద్రం చర్యలు చేపట్టాలి

కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Published : 24 Mar 2023 02:40 IST

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య. చిత్రంలో  సుధాకర్‌, వెంకటేశ్‌, గుజ్జ కృష్ణ, రాము, భూపేశ్‌సాగర్‌, జనార్దన్‌, నిఖిల్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు చట్ట, రాజ్యాంగ, న్యాయపరంగా ఎలాంటి అవరోధాల్లేవని ఆయన అన్నారు. గురువారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడారు. జనాభా ప్రకారం ఉద్యోగుల సంఖ్య లేకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల్లో రిజర్వేషన్లు పెట్టాలని ఉత్తర్‌ప్రదేశ్‌ రిజర్వేషన్ల కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని ఆయన చెప్పారు. అనంతరం కె.రాముకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకపత్రాన్ని అందజేశారు. నేతలు నీలం వెంకటేశ్‌, భూపేశ్‌సాగర్‌, కోలా జనార్దన్‌, నందగోపాల్‌, రాజ్‌కుమార్‌, సుధాకర్‌, నిఖిల్‌, రాంబాబు, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని