logo

శ్రీనివాసుడి కల్యాణం.. కనులారా వీక్షణం

చెంగోల్‌ వెంకటేశ్వర ఆలయంలో శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేెంకటేశ్వరుడి కల్యాణోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు.

Published : 29 Mar 2023 02:21 IST

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: చెంగోల్‌ వెంకటేశ్వర ఆలయంలో శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేెంకటేశ్వరుడి కల్యాణోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉగాది పండుగ తర్వాత వచ్చే తొలి సప్తమినాడు ఏటా కల్యాణోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ ఛైర్మన్‌ వి.కృష్ణయ్య ఆధ్వర్యంలో స్వామి వారి ఉత్సవమూర్తి విగ్రహాలను హనుమాన్‌ దేవాలయం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా వెంకటేశ్వర ఆలయానికి తరలించారు. సంప్రదాయబద్ధంగా ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించి అందంగా అలంకరించిన శ్రీనివాసుడికి శ్రీదేవీ, భూదేవీలతో కల్యాణాన్ని  అర్చకులు కృష్ణ, కిషోర్‌, తిరుమల ఆచార్య శుక్రవార్‌లు కనుల పండువగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు కనులారా వీక్షించారు. సాయిపుత్ర సేవా సమితి అధ్యక్షులు శంకర్‌యాదవ్‌, వివేకానంద యువజన సంఘాధ్యక్షులు రాముయాదవ్‌లను ఛైర్మన్‌ శాలువాతో సత్కరించారు.

ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు

కొడంగల్‌, న్యూస్‌టుడే: శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం అర్ధరాత్రితో ముగిశాయి. ఆలయంలో యజ్ఞం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. బాలాజీ మాడ వీధుల్లో స్వామి వారి ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున తిరుమల నుంచి వచ్చిన అర్చకులు ధ్వజారోహణం చేశారు. 11 రోజుల పూజల అనంతరం ధ్వజ అవరోహణ కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని