logo

Hyderabad: మలక్‌పేట ఐటీ టవర్‌కు శంకుస్థాపన రేపు

మలక్‌పేటలో రూ.1,032 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఐటీ టవర్‌ పనులకు ఈ నెల 29న శంకుస్థాపన చేయనున్నారు.

Updated : 28 Sep 2023 08:53 IST

సైదాబాద్‌, న్యూస్‌టుడే: మలక్‌పేటలో రూ.1,032 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఐటీ టవర్‌ పనులకు ఈ నెల 29న శంకుస్థాపన చేయనున్నారు. మలక్‌పేట ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయంలో పది ఎకరాల స్థలంలో చేపట్టే తొలి విడత పనులకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీలు శంకుస్థాపన చేస్తారని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల తెలిపారు. 21 అంతస్తుల ఈ భవనం పేరును ‘ఐ టెక్‌ న్యూక్లియస్‌’గా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఖరారు చేసింది. నాలుగేళ్లలోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని