logo

Hyderabad: త్వరలో మౌలాలి - హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఎంఎంటీఎస్‌ రెండో దశ పనుల్లో భాగంగా మౌలాలి - సనత్‌నగర్‌ మధ్య నిర్మిస్తున్న రెండో లైను పనులు పూర్తయ్యాయి. దీంతో మౌలాలి నుంచి నేరుగా హైటెక్‌సిటీ మీదుగా లింగంపల్లికి ఎంఎంటీఎస్‌ రైళ్లు నడిపేందుకు అవకాశం లభించనుంది.

Updated : 05 Jan 2024 07:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎంఎంటీఎస్‌ రెండో దశ పనుల్లో భాగంగా మౌలాలి - సనత్‌నగర్‌ మధ్య నిర్మిస్తున్న రెండో లైను పనులు పూర్తయ్యాయి. దీంతో మౌలాలి నుంచి నేరుగా హైటెక్‌సిటీ మీదుగా లింగంపల్లికి ఎంఎంటీఎస్‌ రైళ్లు నడిపేందుకు అవకాశం లభించనుంది. ఫిబ్రవరిలోపే ఈ మార్గంలో ఎంఎంటీఎస్‌లు పట్టాలెక్కనున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు హైటెక్‌సిటీ వైపు ప్రయాణ కష్టాలు తీరుతాయి.

అదనంగా ఆరు స్టేషన్లు

 మౌలాలి - సనత్‌నగర్‌ మధ్య మొత్తం 22 కిలోమీటర్ల పరిధిలో 6 స్టేషన్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. వారందరికీ రూ.5 టికెట్‌తో వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇప్పుడు వీరంతా కేవలం 30 నిమిషాల్లో ఐటీ సంస్థలు ఉండే ప్రాంతాలకు చేరే అవకాశం ఉంటుంది. మల్కాజిగిరి నియోజకవర్గంలో 25 వేల నుంచి 30 వేల మంది ఐటీ ఉద్యోగులు నివాసం ఉంటున్నట్టు కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బీటీ శ్రీనివాస్‌ చెప్పారు.

సొంత ఇంటి నుంచే కార్యాలయాలకు..

సనత్‌నగర్‌, పీర్జాదిగూడ, సుచిత్ర సెంటర్‌, భూదేవినగర్‌, అమ్ముగూడ, నేరేడ్‌మెట్‌, హౌసింగ్‌బోర్డు కాలనీ(ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు), మౌలాలి స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్‌ పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం అక్కడివారు ఐటీ కారిడార్‌కు రావాలంటే నేరేడ్‌మెట్‌, ఆర్‌కేపురం వంతెన, కంటోన్మెంట్‌, బేగంపేట మీదుగా సొంత వాహనాల్లో నానా అవస్థలు పడేవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు