logo

శ్రీవారి బ్రహ్మోత్సవ సేవలో సీఎం సతీమణి

శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భార్య గీతారెడ్డి గురువారం స్వామి సేవలో పాల్గొన్నారు.

Published : 12 Apr 2024 02:53 IST

ఆలయంలో గీతారెడ్డి, అర్చకులు, భక్తులు

కొడంగల్‌, న్యూస్‌టుడే: శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భార్య గీతారెడ్డి గురువారం స్వామి సేవలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రథోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చినట్లు ఆమె తెలిపారు. స్వామి సేవల నిమిత్తం తీసుకు వచ్చిన పట్టువస్త్రాలు, పండ్లు ఇతర సామగ్రిని అర్చకులకు అందించారు. రథోత్సవ ప్రాంతం నుంచి ఆలయం వరకు అర్చకులు ఆమెకు శ్రీవారి ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ధర్మకర్తలు, కుటుంబ సభ్యులతో ఆమె మాట్లాడారు. అర్చకుల నివాసానికి వెళ్లి పండ్లు ఇతర వస్తువులు అందించారు. అక్కడే అల్పాహారం తీసుకున్నారు. అనంతరం కొడంగల్‌లోని తమ నివాసానికి చేరుకుని అరగంట అనంతరం హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి భార్య హోదాలో మొదటి సారి కొడంగల్‌కు రావడంతో ఆమెను చూసేందుకు, ఫొటోలు దిగేందుకు మహిళలు ఎంతో ఉత్సాహం చూపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్‌, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని