logo

హైదరాబాద్‌ ఖుషియోం కీ ఈద్‌

బహదూర్‌పురలోని చారిత్రక మీరాలం ఈద్గాలో గురువారం ఈద్‌ ఉల్‌ ఫిత్ర్‌ సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.

Published : 12 Apr 2024 02:54 IST

చార్మినార్‌, న్యూస్‌టుడే: బహదూర్‌పురలోని చారిత్రక మీరాలం ఈద్గాలో గురువారం ఈద్‌ ఉల్‌ ఫిత్ర్‌ సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. జంటనగరాలు, శివారు ప్రాంతాలు, జిల్లాలకు చెందిన ముస్లింలు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలోపు ఈద్గా ఆవరణ నిండిపోవడంతో బెంగళూరు జాతీయ రహదారిపై జూపార్కు వరకు, అలాగే మీరాలం చెరువు పక్కనే ఉన్న తాడుబన్‌, కాలాపత్తర్‌ వరకు బారులు తీరారు. సామూహిక నమాజ్‌ను కతీబ్‌ హఫీజ్‌ మౌలాలా రిజ్వాన్‌ ఖురేషి, మక్కామసీదులో ఇమామ్‌ హఫీజ్‌ లతీఫ్‌అహ్మద్‌ నిర్వహించారు. అనంతరం అరబిక్‌లో రంజాన్‌ ఈద్‌ ఉల్‌ఫిత్ర్‌ సందేశాన్ని వినిపించారు.

ఓటరుగా నమోదు చేసుకోండి: ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు కావాలని, ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని దారుల్‌ ఉలూమ్‌ విద్యా సంస్థ అధ్యక్షుడు మౌలానా హుస్సాముద్దీన్‌ జాఫర్‌పాషా, జామియా నిజామియా షేకుల్‌ఆదిస్‌ డా.సైఫుల్లా తమ సందేశాల్లో వివరించారు. సామూహిక ప్రార్థనల్లో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, బహదూర్‌పుర ఎమ్మెల్యే మహ్మద్‌ మొబీన్‌,  చార్మినార్‌ ఎమ్మెల్యే మిర్‌ జుల్ఫీకర్‌ అలీ, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి తఫ్సీర్‌ ఎక్బాల్‌, మాజీ ఎమ్మెల్యే పాషాఖాద్రి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని