logo

దిల్లీలో కుస్తీ.. రాష్ట్రంలో దోస్తీ

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ చాలా తెలివైన రాజకీయ క్రీడాకారుడని,  ఓవైపు ‘ఇండియా’ కూటమికి మద్దతు ఇవ్వనంటూనే తెలంగాణలో మాత్రం తెర వెనుక అదే కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్నాడని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు.

Updated : 12 Apr 2024 05:32 IST

కాంగ్రెస్‌తో ఎంఐఎం వైఖరి ఇది
గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

గోషామహల్‌, న్యూస్‌టుడే: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ చాలా తెలివైన రాజకీయ క్రీడాకారుడని,  ఓవైపు ‘ఇండియా’ కూటమికి మద్దతు ఇవ్వనంటూనే తెలంగాణలో మాత్రం తెర వెనుక అదే కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్నాడని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. గురువారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. 40 ఏళ్లుగా రాజ్యమేలుతున్న పాతబస్తీలో ముస్లిం మైనార్టీ ఓటర్లు ఈ సారి అసదుద్దీన్‌పై అసంతృప్తిగా ఉన్నారని.. పసిగట్టిన ఒవైసీ కొత్త నాటకానికి తెర లేపారన్నారు. మరోసారి గెలవాలంటే భాజపాను తిట్టడమే  ప్రామాణికంగా పెట్టుకొని తెర వెనుక కాంగ్రెస్‌తో, తెర ముందు భారాసతో పొత్తు కుదుర్చుకొని రాజకీయ చదరంగం ఆడుతున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందూ-ముస్లిం అనే పాచికను మరోసారి అస్త్రంగా ఉపయోగించి లబ్ధిపొందేందుకు ప్యూహాత్మకంగా ఆయన అడుగులు వేస్తున్నారని విమర్శించారు. ముస్లింలు అభివృద్ధి కోసం మోదీ నేతృత్వంలోని భాజపాకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏళ్లుగా పాతబస్తీ ఎంత అభివృద్ధి సాధించిందో ఆలోచించి ఓటువేయాలని కోరారు. ఈ సారి భాజపాకి అవకాశమిస్తే పాతబస్తీ అభివృద్ధిలో దూసుకెళ్లడం ఖాయమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని