logo

ప్రపంచ చరిత్ర లోహ నాణేలతో ముడిపడి ఉంది

డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం, సౌత్‌ ఇండియన్‌ న్యూమిస్మాటిక్స్‌ సొసైటీ, తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సహకారంతో నిర్వహించిన దక్షిణ భారత న్యూమిస్మాటిక్స్‌ సొసైటీ 32వ వార్షిక సదస్సు గురువారం ముగిసింది

Published : 12 Apr 2024 03:03 IST

పుస్తకాన్ని ఆవిష్కరించిన వీసీ కె.సీతారామారావు, చిత్రంలో డా.రాజారెడ్డి, సత్యమూర్తి సుధారాణి, పి.అనురాధరెడ్డి

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం, సౌత్‌ ఇండియన్‌ న్యూమిస్మాటిక్స్‌ సొసైటీ, తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సహకారంతో నిర్వహించిన దక్షిణ భారత న్యూమిస్మాటిక్స్‌ సొసైటీ 32వ వార్షిక సదస్సు గురువారం ముగిసింది. ‘న్యూమిస్మాటిక్స్‌ - దక్షిణ భారత చరిత్ర - పునర్నిర్మాణం’, అంశంపై సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.కె.సీతారామారావు ప్రసంగించారు. ప్రపంచ చరిత్ర లోహంతో ముడిపడి ఉందని, లోహ నాణేలు ఆ ప్రాంత చరిత్రను బహిర్గతం చేస్తాయన్నారు. యువ పరిశోధకులు దీనిపై దృష్టి సారిస్తే చరిత్రకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వస్తాయన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన సెమినార్‌ డైరెక్టర్‌ ప్రొ.సుధారాణి,   సౌత్‌ ఇండియన్‌ న్యూమిస్మాటిక్స్‌ సొసైటీ అధ్యక్షుడు డా.రాజారెడ్డి మాట్లాడారు. వర్సిటీ డీన్‌ ప్రొ.వడ్డాణం శ్రీనివాస్‌ సదస్సు నివేదికను సమర్పించారు. ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) కేరళ డైరెక్టర్‌ డా.సత్యమూర్తి,  ఇంటాక్‌ హైదరాబాద్‌ ఛాప్టర్‌ ప్రెసిడెంట్‌ పి.అనురాధరెడ్డి పాల్గొన్నారు. పురావస్తుశాఖ మాజీ డైరెక్టర్‌ ప్రొ.పి.చెన్నారెడ్డి రచించిన ‘న్యూమిస్మాటికా ఇండికా’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని