logo

మంగోలియా మెట్రోకు మార్గదర్శనం

మంగోలియా దేశ రాజధాని ఉలాన్‌ బాతర్‌లో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ చేపట్టేందుకు మార్గదర్శనం చేయాలని ఆ దేశ ప్రతినిధి బృందం హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌)ను కోరింది.

Published : 12 Apr 2024 03:04 IST

మంగోలియా బృందంతో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: మంగోలియా దేశ రాజధాని ఉలాన్‌ బాతర్‌లో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ చేపట్టేందుకు మార్గదర్శనం చేయాలని ఆ దేశ ప్రతినిధి బృందం హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌)ను కోరింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంపై ఆడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కి)లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు మంగోలియన్‌ ప్రభుత్వ సీనియర్‌ అధికారులు 20 మంది హాజరయ్యారు. ఆ బృందానికి క్యాబినెట్‌ సెక్రటెరియట్‌ చెందిన మంత్రి పురేవ్‌సురెన్‌ నాయకత్వం వస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ విధానంలో చేపట్టి హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్ట్‌ వివరాలను గురువారం బేగంపేటలోని మెట్రోరైలు భవన్‌లో సంస్థ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డిని కలిసి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్‌ ప్రారంభించినప్పటి నుంచి ఎదురైన సాంకేతిక చిక్కులు, డాక్యుమెంటేషన్‌, చట్టపరమైన సమస్యలు అధిగమించిన తీరును ఎన్వీఎస్‌రెడ్డి వారికి వివరించారు. ప్రాజెక్ట్‌ను పట్టాలక్కేందుకు సున్నితమైన సమస్యలు, సవాళ్లను పరిష్కరించడానికి అనుసరించిన వ్యూహాలను వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు