logo

నకిలీ మకిలీ వదలదా..?

నకిలీ ఓట్లపై వస్తోన్న ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ ఖాతరు చేయడం లేదు.

Published : 12 Apr 2024 03:13 IST

ఆరు లక్షల బోగస్‌ ఓట్లపై జాబితా ఇచ్చిన నేతలు
5 శాతం ఓట్లను కూడా పరిశీలించని జీహెచ్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: నకిలీ ఓట్లపై వస్తోన్న ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ ఖాతరు చేయడం లేదు. ఒక్క హైదరాబాద్‌ పార్లమెంటు పరిధిలోనే ఆరు లక్షల నకిలీ ఓట్లున్నాయనే కాంగ్రెస్‌, భాజపా నేతల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తోంది. అదే విషయమై ఈసీ ఆదేశాలనూ పట్టించుకోలేదు.

నమోదూ అడ్డదిడ్డమే.. ఓటరు నమోదు, సవరణ, తొలగింపు వంటి దరఖాస్తులను స్వీకరించి.. వాటిని  ఆన్‌లైన్‌లో నింపే పనులను సర్కిల్‌ ప్రైవేటు ఏజెన్సీలకు ఇస్తుంటారు. అక్కడే నకిలీ ఓట్లకు బీజం పడుతోంది. పాతబస్తీకి చెందిన నియోజకవర్గాల నుంచి అందిన దరఖాస్తులను సాయి ప్రాజెక్ట్స్‌, జోయ్‌ సొల్యూషన్స్‌ సంస్థలకు అప్పగించారు. బీఎల్‌ఓల లాగిన్‌లను ఉపయోగించుకుని నకిలీ ఓట్లను పెద్దఎత్తున జాబితాలో చేర్చారనే విమర్శలున్నాయి. ఓ ఉన్నతాధికారి బంధువు ఆ ఏజెన్సీల్లో పనిచేస్తూ నకిలీ ఓట్లను చేర్చుతున్నారనే ఆరోపణలున్నాయి.  ఓటరు జాబితాలను రాజకీయ పార్టీలకు విక్రయిస్తూ ఓటరు వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

అడ్డంకులతో ఆపేశారు.. నగరంలో నకిలీ ఓట్లు 20 శాతం మేర ఉన్నాయంటూ కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌ ఈసీకి ఫిర్యాదు చేయగా, దీనిపై నివేదిక ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. పాతబస్తీలో అధికారులు తనిఖీలకు వెళ్లగా కొందరు స్థానిక నేతలు అడ్డుకున్నారు. బీఎల్‌ఓలను వెనక్కి పంపారని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో తెలిపారు.

పక్కాగా తనిఖీ చేశాం..

మంగతాయారు, ఎన్నికల విభాగం అదనపు కమిషన్‌

భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపాం. నామమాత్రంగా నకిలీ ఓట్లు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఓటర్లుండటం, చనిపోయిన వారికి ఓటు హక్కు ఉండటం, తదితర అంశాల్లో వచ్చిన ఫిర్యాదులు కేవలం ఆరోపణలు మాత్రమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు