logo

వరుస చోరీలు... గొలుసు దొంగ అరెస్ట్‌

డ్రైవర్‌గా పనిచేస్తున్న అతను జల్సాలకు అలవాటు పడ్డాడు. కుటుంబ పోషణ భారమయ్యింది. దీంతో చైన్‌ స్నాచింగ్‌ బాట పట్టాడు. రోడ్లపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడలోని గొలుసులను తెంపుకుపోతున్న దొంగను కుషాయిగూడ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

Published : 13 Apr 2024 02:20 IST

కాప్రా, న్యూస్‌టుడే: డ్రైవర్‌గా పనిచేస్తున్న అతను జల్సాలకు అలవాటు పడ్డాడు. కుటుంబ పోషణ భారమయ్యింది. దీంతో చైన్‌ స్నాచింగ్‌ బాట పట్టాడు. రోడ్లపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడలోని గొలుసులను తెంపుకుపోతున్న దొంగను కుషాయిగూడ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. రూ.5.80 లక్షల విలువైన మూడు పుస్తెల తాళ్లు, ఒక పల్సర్‌ ద్విచక్రవాహనాన్ని స్వాధీన పర్చుకున్నారు. కుషాయిగూడ ఏసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏసీపీ టి.మహేశ్‌ కేసు వివరాలను వెల్లడించారు. వరంగల్‌ జిల్లా హన్మకొండలోని ఇందిరానగర్‌కు చెందిన పుట్టా హరికృష్ణ (38) డ్రైవర్‌. అతనికి భార్యా, ఇద్దరు కుమార్తెలున్నారు. బతుకుదెరువుకు రెండేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. చెంగిచెర్లలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.    జల్సాలకు అలవాటు పడ్డాడు. కుటుంబ పోషణ, పిల్లల స్కూలు ఫీజులు చెల్లించడం భారమైంది. గొలుసు దొంగతనాలకు తెగించాడు.  కుషాయిగూడ, కీసర ఠాణాల పరిధిలో రెండు చోట్ల,  సైదాబాద్‌ ఠాణా పరిధిలో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. చెంగిచెర్లలోని అతని నివాసంలో పుట్టా హరికృష్ణను అరెస్ట్‌ చేశారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ జి.వీరాస్వామి, డీఐ బి.రాజునాయక్‌, ఎస్‌ఐలు యాదగిరి, వేణుమాధవ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని