logo

నీటి వినియోగం.. అంతా మా ఇష్టం

ఓ వైపు నీటి కొరత వెంటాడుతుంటే కొన్ని పరిశ్రమల్లో ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం నీటి మీటర్లు బిగించకుండా పరిమితికి మించి వాడేస్తున్నారు.

Published : 13 Apr 2024 02:21 IST

వ్యర్థాల శుద్ధి ప్లాంట్లకు లెక్కలేని తనం

ఈనాడు, హైదరాబాద్‌: ఓ వైపు నీటి కొరత వెంటాడుతుంటే కొన్ని పరిశ్రమల్లో ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం నీటి మీటర్లు బిగించకుండా పరిమితికి మించి వాడేస్తున్నారు. వినియోగించే నీటికి, వెలువడే వ్యర్థజలాలకు సైతం పొంతన ఉండటం లేదు. మరికొందరు ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటుకు అమర్చే ఇన్‌లెట్‌, అవుట్‌లెట్‌ మీటర్లను తీసేసి వ్యర్థ జలాల లెక్కల్లో గోల్‌మాల్‌ చేస్తున్నారు.

నిబంధనలకు చెల్లుచీటీ: ఫార్మా, రసాయన పరిశ్రమలు, బాయిల్డ్‌ రైస్‌మిల్లులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు, జంతు వధశాలల రెండరింగ్‌ ప్లాంట్స్‌, బేవరేజెస్‌, బాయిలర్లను ఎక్కువగా వాడే పరిశ్రమల్లో ఎక్కువగా నీటి వినియోగం ఉంటుంది. వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి నీటి వినియోగానికి నిర్దేశిత పరిమితులున్నాయి.

  • మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్లలోని తెలంగాణ స్టేట్‌ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కోఆపరేషన్‌ ఫెడరేషన్‌లో ప్రతిరోజూ 310 కిలోలీటర్ల వ్యర్థ జలాల ఉత్పత్తి ఉంటుందని పీసీబీ కన్‌సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ అనుమతులు జారీ చేసింది. సంబంధిత లెక్కలు మాత్రం చూపడం లేదని గుర్తించింది. వ్యర్థజలాలను ఈపీటీకి తరలించకుండా పక్కనే ఉన్న నారపల్లి అభయారణ్యంలోని మైదానంలోకి తరలిస్తున్నట్టు గుర్తించారు. చెంగిచెర్లలో ఉన్న మరో కామన్‌ రెండరింగ్‌ ప్లాంట్‌లో బాయిలర్‌, గార్డెనింగ్‌, ప్రాసెస్‌, వాషెస్‌, డొమెస్టిక్‌ విభాగాల్లో 75 కేఎల్‌డీల నీటి వినియోగానికి అనుమతులున్నాయి. ఇక్కడా రికార్డులు లేవు. బాలానగర్‌లోని ఓ గాజు ఉత్పత్తుల పరిశ్రమకు 270 కేఎల్‌డీల నీటి వినియోగానికి అనుమతులుండగా కొన్నేళ్లుగా రికార్డులు నిర్వహించడం లేదని అధికారులు గుర్తించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని