logo

మూడేళ్లలో మధ్యవర్తిత్వంతో 400 కేసుల పరిష్కారం

మధ్యవర్తిత్వ సేవలో తమ సంస్థ మూడేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని అమికా అధ్యక్షురాలు జ్యోతిరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవధిలో 400కు పైగా  వివాదాలను పరిష్కరించామని, 12 మంది మధ్యవర్తులకు శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలను అందజేశామని వివరించారు.

Published : 13 Apr 2024 02:22 IST

జ్యోతిరావు

ఈనాడు, హైదరాబాద్‌: మధ్యవర్తిత్వ సేవలో తమ సంస్థ మూడేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని అమికా అధ్యక్షురాలు జ్యోతిరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవధిలో 400కు పైగా  వివాదాలను పరిష్కరించామని, 12 మంది మధ్యవర్తులకు శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలను అందజేశామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వ చట్టం తీసుకొచ్చిందని... దానికి తుది రూపు ఇవ్వడానికి తమ నుంచి సలహాలు స్వీకరించి పొందుపర్చారని వెల్లడించారు. వ్యాపార సంబంధ, ఆస్తితగాదాలు, కుటుంబ కలహాలు, విడాకులు, భార్యభర్తల మధ్య పొరపొచ్చాల లాంటి అనేక అంశాలపై తమను సంప్రదిస్తుంటారని పేర్కొన్నారు. తమను 9676875789 నంబరులో కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చని జ్యోతిరావు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని