logo

రోడ్లపై చెత్తకు చెక్‌

ఇంట్లోని చెత్త కాలనీ రోడ్లపై వేస్తోన్న కుటుంబాలు రెండు లక్షల మేర ఉన్నాయని జీహెచ్‌ఎంసీ సర్వేలో తేలింది. ‘బస్తీ కార్యాచరణ’ పేరుతో ఇంటింటికి తిరిగి, స్వచ్ఛ ఆటోల పనితీరును మదింపు చేయడంతో, ఆటోలకు వ్యర్థాలను ఇవ్వని ఇళ్లు లెక్క తేలుతున్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

Published : 13 Apr 2024 02:25 IST

రెండు లక్షల కుటుంబాల గుర్తింపు
ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంట్లోని చెత్త కాలనీ రోడ్లపై వేస్తోన్న కుటుంబాలు రెండు లక్షల మేర ఉన్నాయని జీహెచ్‌ఎంసీ సర్వేలో తేలింది. ‘బస్తీ కార్యాచరణ’ పేరుతో ఇంటింటికి తిరిగి, స్వచ్ఛ ఆటోల పనితీరును మదింపు చేయడంతో, ఆటోలకు వ్యర్థాలను ఇవ్వని ఇళ్లు లెక్క తేలుతున్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ నగరాన్ని వ్యర్థాలమయం చేస్తోన్నవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రూ.1000 జరిమానా ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో.. స్వచ్ఛ హైదరాబాద్‌ను సాకారం చేసుకునేందుకు, నగరవాసులంతా స్వచ్ఛ ఆటోలను ఉపయోగించాలన్నారు. ప్రజల్లో మార్పు తెచ్చేందుకు ఒక్కో బస్తీలో వారం రోజుల కార్యాచరణను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వారం రోజుల కార్యాచరణ ఇలా..

రోజు అంశం

1 బస్తీలో సమావేశం
2 స్వచ్ఛ ఆటోకు చెత్త ఇవ్వని ఇళ్ల గుర్తింపు
3 కాలనీవాసులతో ర్యాలీ
4 స్థానికులందరికీ పరిశుభ్రతపై అవగాహన
5 కాలనీ/బస్తీలో చెత్త కుప్పల తొలగింపు, ముగ్గులు వేయడం, లేదా చెట్లు నాటడం.
6 స్థానిక డ్వాక్రా సంఘాల లీడర్లతో సమావేశం.. పరిశుభ్రత బాధ్యత అప్పగింత
7 స్వచ్ఛ ప్రతిజ్ఞ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని