logo

ఆడుకుంటూ.. అనంతలోకాలకు!

ఏడాదికే ఆ చిన్నారికి నూరేళ్లు నిండాయి. బుడిబుడి అడుగులతో సందడి చేసే చిన్నారి ఇక లేదని ఆ కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జీడిమెట్ల ఠాణా పరిధిలో చిన్నారి బకెట్‌లోని నీటిలో పడి మృతి చెందింది.

Updated : 13 Apr 2024 05:10 IST

బకెట్‌లోని నీటిలో పడి  చిన్నారి దుర్మరణం

జీడిమెట్ల,న్యూస్‌టుడే: ఏడాదికే ఆ చిన్నారికి నూరేళ్లు నిండాయి. బుడిబుడి అడుగులతో సందడి చేసే చిన్నారి ఇక లేదని ఆ కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జీడిమెట్ల ఠాణా పరిధిలో చిన్నారి బకెట్‌లోని నీటిలో పడి మృతి చెందింది. ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్‌ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన సుధాకర్‌, బిందు దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కూతురు ఆద్య, చిన్న కుమార్తె రియా(1). సుధాకర్‌ ప్రైవేటు సంస్థ మార్కెటింగ్‌ విభాగంలో పనిచేస్తారు. శుక్రవారం అతను విధులకు వెళ్లారు. బిందు ఇంట్లో పని చేస్తుండగా పిల్లలిద్దరూ స్నానాలగదిలో ఆడుకుంటున్నారు. కొంతసేపటికి పెద్ద కూతురు బయటకు వచ్చింది. రియా ఒంటరిగా అక్కడే ఉంది. పిల్లలు ఆడుకుంటున్నారని తల్లి భావించి పనుల్లో నిమగ్నమైంది. కొద్దిసేపటికి పెద్దపాపను గమనించి.. రియా గురించి అడుగగా స్నానాల గదిలోనే ఉందని చెప్పింది. వెంటనే వెళ్లి చూడగా బకెట్‌లోని నీటిలో తలకిందులుగా పడి అచేతన స్థితిలో ఉంది. సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని