logo

పెరగనున్న సిటీ బస్సులు

గ్రేటర్‌లో సిటీ బస్సుల సంఖ్య పెరుగుతోంది. 2,850 బస్సులతో ప్రధాన రూట్లకే పరిమితమైన ఆర్టీసీ ఇప్పుడు పూర్వవైభవాన్ని చాటేందుకు సిద్ధమౌతోంది.

Published : 13 Apr 2024 02:35 IST

జిల్లాలో తిరిగే డీలక్స్‌లు నగరానికి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో సిటీ బస్సుల సంఖ్య పెరుగుతోంది. 2,850 బస్సులతో ప్రధాన రూట్లకే పరిమితమైన ఆర్టీసీ ఇప్పుడు పూర్వవైభవాన్ని చాటేందుకు సిద్ధమౌతోంది. కొత్తవి కొనలేని పరిస్థితుల్లో జిల్లాల్లో తిరుగుతున్న డీలక్స్‌ బస్సులను నగరానికి తెచ్చి సిటీ బస్సులుగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. డీలక్స్‌ బాడీని తీసేసి మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల మాదిరి తయారుచేస్తున్నారు. అందుకు రూ.6 లక్షల చొప్పున ఖర్చుచేస్తున్నారు. కొత్తవి కొనాలంటే రూ.30 లక్షలకుపైగా అవుతుంది మరి. అద్దె ప్రాతిపదికన ఎలక్ట్రిక్‌ బస్సులు కూడా నగర ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో లేనిమార్గాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్‌ ఏసీబస్సులు తిరుగుతుండగా.. ఇటీవల మెట్రో ఎక్స్‌ప్రెస్‌ స్థానంలో ఎలక్ట్రిక్‌ నాన్‌ ఏసీ బస్సులు 25 వరకు తోడయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరానికి 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు గ్రేటర్‌జోన్‌కు సమకూరుతున్నాయని ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. గతంలో 3850 సిటీ బస్సులు గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో ఉండేవి. 2019లో దీర్ఘకాల సమ్మె అనంతరం ఒకేసారి 1000 బస్సులను అప్పటి ప్రభుత్వం తగ్గించింది. అలా పలు కారణాలతో ప్రయాణికుల సంఖ్య 11 లక్షలకు పడిపోయింది. తాజాగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఒక్కసారి ప్రయాణికులు రెట్టింపయ్యారు. కానీ బస్సులు పెరగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు