logo

అన్న హత్య కేసులో తమ్ముడి సహా ఏడుగురి అరెస్టు

  పగిడిపల్లికి చెందిన ఎర్ర హన్మప్ప హత్య కేసులో నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు గ్రామీణ సీఐ అశోక్‌, యాలాల ఎస్‌ఐ శంకర్‌ వివరాలను తెలిపారు.

Published : 14 Apr 2024 02:15 IST

యాలాల, న్యూస్‌టుడే:  పగిడిపల్లికి చెందిన ఎర్ర హన్మప్ప హత్య కేసులో నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు గ్రామీణ సీఐ అశోక్‌, యాలాల ఎస్‌ఐ శంకర్‌ వివరాలను తెలిపారు. ఎర్ర హన్మప్ప, ఎర్ర సమ్మప్పలు అన్నదమ్ములు. ఇంటి స్థలం విషయంలో ఇద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారు. పాత కక్షలు మనసులో పెట్టుకుని ఈ నెల 8 మధ్యాహ్నం పగిడిపల్లి గ్రామ శివారులోని హన్మప్ప పొలంలో హన్మప్ప(45)ను సమ్మప్ప, సమీప బంధువులైన ఎర్ర రమేష్‌, గొట్టిగ రాజు, పుండికూర శేఖర్‌, ఎర్ర మొగులమ్మ, ఎర్ర బస్వరాజ్‌, మ్యాతరి రమేష్‌లు కర్రలతో తీవ్రంగా కొట్టారు. దీంతో హన్మప్ప అక్కడికక్కడే మరణించాడు. నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు,  నిందితులు అగ్గనూర్‌లో పుండికూర శేఖర్‌ ఇంట్లో ఉన్నారన్న సమాచారంతో శుక్రవారం తెల్లవారు జామున అదుపులోకి తీసుకుని పరిగి మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. రిమాండ్‌ విధించడంతో పరిగి జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని