logo

స్టాక్‌ సలహాలంటూ నమ్మించి రూ.34 లక్షలు స్వాహా

షేర్ల క్రయవిక్రయాల్లో సాయం చేస్తామంటూ నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు రూ.34 లక్షలు కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Published : 14 Apr 2024 02:25 IST

ఈనాడు- హైదరాబాద్‌: షేర్ల క్రయవిక్రయాల్లో సాయం చేస్తామంటూ నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు రూ.34 లక్షలు కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి(52)కి స్టాక్‌ ట్రేడింగ్‌ సలహాలిస్తామంటూ ఇటీవల వాట్సాప్‌లో సందేశం వచ్చింది. ఆ నంబరులో సంప్రదించగా.. సైబర్‌ నేరగాళ్లు అతడ్ని దాదాపు 200 మంది ఉన్న వాట్సాప్‌ గ్రూపులో చేర్చారు. ఎల్‌కేపీఎస్‌ఎల్‌ యాప్‌ ద్వారా షేర్ల క్రయవిక్రయాలు చేయాలని సూచించగా.. బాధితుడు అలాగే చేశాడు. తర్వాత పుల్‌అప్‌షేర్లు కొనుగోలు చేయించి, కొంతమేర లాభం వచ్చినట్లు చూపించారు. బాధితుడి అనుమతి లేకుండా రూ.1.26 లక్షల విలువైన 1500 షేర్లను అతని పేరిట బదలాయించారు.  ఆ తర్వాత మరో 10వేల షేర్లు బదిలీ చేసి రూ.20 లక్షల లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించారు. తమకు రూ.34లక్షలు ఇవ్వాలని, లేకపోతే ట్రేడింగ్‌ ఖాతా బ్లాక్‌ చేసి, అందులో ఉన్న రూ.10.96 లక్షలు తీసుకునే వీల్లేకుండా చేస్తామన్నారు. దీంతో బాధితుడు రూ.34 లక్షలు పంపాడు. తర్వాత వారి నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని