logo

సాంగ్‌.. రాజా‘సింగ్‌’..!

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే.. హైదరాబాద్‌ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శ్రీరామనవమిని పురస్కరించుకొని తొలిసారి తెలుగులో పాట రాసి స్వయంగా పాడారు.

Published : 14 Apr 2024 06:04 IST

పాట పాడుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌

గోషామహల్‌, న్యూస్‌టుడే: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే.. హైదరాబాద్‌ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శ్రీరామనవమిని పురస్కరించుకొని తొలిసారి తెలుగులో పాట రాసి స్వయంగా పాడారు. నగరంలోని ధూల్‌పేట కేంద్రంగా శ్రీరామ నవమి శోభాయాత్రకు 13 ఏళ్ల క్రితం ఆయన శ్రీకారం చుట్టి దేశ వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్శించారు. శనివారం ఆయన పాట ట్రయల్‌ విడుదల చేశారు. ‘‘ హిందువుగా పుట్టాలి.. హిందువుగా బ్రతకాలి.. హిందువుగా చావాలిరా.. కాషాయ మెత్తాలి ముందడుగు వెయ్యాలి.. పులిలా గర్జించాలిరా తమ్ముడూ..’’ అంటూ ఎమ్మెల్యే పాడిన పాట ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పూర్తి పాటను ఈ నెల 17న ధూల్‌పేటలోని ఆకాశపురి హనుమాన్‌ ఆలయం వద్ద విడుదల చేసి... శోభాయాత్ర ప్రారంభించనున్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని