logo

అంతర్జాతీయ వివాదాల పరిష్కార వ్యవస్థ ఎంతో కీలకం

ప్రపంచ వ్యాప్తంగా  అనేక వివాదాలను పరిష్కరించడంలో ప్రపంచ వాణిజ్య సంస్థ వివాదాల పరిష్కార వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ విశ్రాంత ఛైర్‌, అప్పీలేట్‌ కమిటీ సభ్యుడు ఉజల్‌ సింగ్‌ భాటియా పేర్కొన్నారు.

Published : 14 Apr 2024 05:50 IST

సదస్సులో మాట్లాడుతున్న ఉజల్‌ సింగ్‌ భాటియా

శామీర్‌పేట: ప్రపంచ వ్యాప్తంగా  అనేక వివాదాలను పరిష్కరించడంలో ప్రపంచ వాణిజ్య సంస్థ వివాదాల పరిష్కార వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ విశ్రాంత ఛైర్‌, అప్పీలేట్‌ కమిటీ సభ్యుడు ఉజల్‌ సింగ్‌ భాటియా పేర్కొన్నారు. శనివారం నల్సార్‌ న్యాయ విశ్వ విద్యాలయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పారిస్‌ ట్రేడ్‌ న్యూఢిల్లీ, నల్సార్‌ విశ్వ విద్యాలయం, జస్టిస్‌ బీపీ.జీవన్‌రెడ్డి సెంటర్‌ ఫర్‌ ఇంటర్‌ నేషనల్‌ ట్రేడ్‌లా ఆధ్వర్యంలో ‘వివాద పరిష్కార వ్యవస్థకు సంక్షోభాలు-పరిష్కారాలు’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఇరవై ఏళ్లుగా వివాదాల పరిష్కార వ్యవస్థ ఎన్నో అంశాలను పరిష్కరించిందని తెలిపారు.  వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ అప్పీలేట్‌ కమిటీ సెక్రటేరియట్‌ మాజీ డైరెక్టర్‌ ఆచార్య వెర్నర్‌ జెడక్‌ మాట్లాడుతూ.. వివాదాల పరిష్కార వ్యవస్థకు నూతన ఆలోచన విధానం అవసరమని వివరించారు. నల్సార్‌ ఉప కులపతి ఆచార్య పి.కృష్ణదేవరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య విద్యుల్లాతారెడ్డి, వివాదాల పరిష్కార సంస్థ విశ్రాంత సభ్యుడు అతుల్‌ కౌశిక్‌, భారత ప్రభుత్వ మాజీ అడిషనల్‌ సెక్రటరీ ఆచార్య షీలారాయ్‌, నేషనల్‌ లా స్కూల్‌ ఒడిశా ఆచార్య శైలాజాసింగ్‌, న్యాయ నిపుణులు ఆర్వీ అనురాధ పాల్గొన్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని