logo

రూ.కోట్ల నిధులు.. కలగా పనులు!

పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల క్రీడా ప్రతిభను గుర్తించి శిక్షణ ఇప్పిస్తే వారి భవితకు బాటలు పడతాయి. అంతేకాకుండా గ్రామీణ క్రీడాకారులు మరింత తోడ్పాటు అందిస్తే ప్రతిభ చాటే అవకాశం ఉంటుంది.

Updated : 15 Apr 2024 06:29 IST

మినీస్టేడియం నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం

న్యూస్‌టుడే, వికారాబాద్‌టౌన్‌: పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల క్రీడా ప్రతిభను గుర్తించి శిక్షణ ఇప్పిస్తే వారి భవితకు బాటలు పడతాయి. అంతేకాకుండా గ్రామీణ క్రీడాకారులు మరింత తోడ్పాటు అందిస్తే ప్రతిభ చాటే అవకాశం ఉంటుంది.  ఈ విషయాన్ని గుర్తించిన గత సర్కారు మినీస్టేడియం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రం వికారాబాద్‌కు సమీపంలో దన్నారం వద్ద 2015లో ఐదు ఎకరాల స్థలాన్ని అధికారులు కేటాయించారు. ఇందుకోసం రూ.2.65 కోట్లు విడుదల చేశారు. అయినా ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరుతున్నారు. స్టేడియం అందుబాటులోకి వస్తే క్రీడాకారులకు వసతులు సమకూరి మెరుగైన ప్రతిభ చాటేందుకు అవకాశముంది. శిక్షకులను నియమించడంతో నిత్యం సాధన చేయవచ్చు.


మళ్లీ ప్రతిపాదనలు పంపాం
నుమంతరావు, యువజన క్రీడలశాఖ అధికారి

ప్రభుత్వం భూమి కేటాయించింది. ప్రస్తుతం ఉన్న ధరలకు నిధులు సరిపోవు. గతంలో విడుదల చేసిన వాటితో కలుపుకొని మొత్తం రూ.5.8 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే పనులను ప్రారంభిస్తాం ఏడాదిలోగా అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని