logo

నో ఏసీ.. తగ్గేదేలే

గిట్టుబాటు కాకపోవడంతోనే ‘నో ఏసీ’ ప్రచారాన్ని ప్రారంభించినట్టు ‘తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ యూనియన్‌, ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ తెలిపాయి.

Published : 15 Apr 2024 02:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: గిట్టుబాటు కాకపోవడంతోనే ‘నో ఏసీ’ ప్రచారాన్ని ప్రారంభించినట్టు ‘తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ యూనియన్‌, ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ తెలిపాయి. కంపెనీల బెదిరింపులకు తలొగ్గేది లేదని, తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఇది కొనసాగుతుందని స్పష్టం చేశాయి. క్యాబ్‌ల్లో వెళ్లే ప్రయాణికులు తమ బాధను అర్థం చేసుకుంటున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి. ఏకరీతి ఛార్జీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని డిమాండ్లు నెరవేర్చకపోతే మరికొన్ని రాష్ట్రాల్లో ‘నో ఏసీ’ ప్రచారం ప్రారంభిస్తామని తెలిపాయి. ఏసీకి కిలోమీటరుకు రూ.16-18 ఖర్చవుతుండగా ప్లాట్‌ఫాం కంపెనీలు రూ.10-12 మాత్రమే ఛార్జీలు చెల్లిస్తున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని