logo

నీట్‌లో అర్హత సాధించలేనని భవనం పైనుంచి దూకి ఆత్మహత్య

నీట్‌లో అర్హత సాధించలేననే మనస్తాపంతో విద్యార్థి అపార్టుమెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్‌బషీరాబాద్‌ ఎస్సై రాంనారాయణ వివరాల మేరకు..

Published : 15 Apr 2024 02:11 IST

పియూస్‌

పేట్‌బషీరాబాద్‌: నీట్‌లో అర్హత సాధించలేననే మనస్తాపంతో విద్యార్థి అపార్టుమెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్‌బషీరాబాద్‌ ఎస్సై రాంనారాయణ వివరాల మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దంపతులు అరవింద్‌ జస్వాల్‌, మీన్‌ జీడిమెట్ల స్ప్రింగ్‌ఫీల్డ్‌ కాలనీ చంద్రోదయ రెసిడెన్సీలో ఉంటున్నారు. భార్యాభర్తలు స్థానికంగా గార్మెంట్స్‌ నిర్వహిస్తుంటారు. వారికి కుమారుడు పియూస్‌ జస్వాల్‌(22), కుమార్తె ఉన్నారు. పియూస్‌ గతంలో రెండుసార్లు నీట్‌ పరీక్ష రాసినా అర్హత సాధించలేదు. వచ్చే నెల 5వన జరగనున్న నీట్‌ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. శనివారం రాత్రి 11 వరకు ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఐపీఎల్‌ మ్యాచ్‌ చూశారు. నీట్‌ పరీక్షకు చదవలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని కోచింగ్‌ తీసుకుంటున్న తోటి విద్యార్థుల గ్రూపులో మెసేజ్‌ పెట్టాడు. వారు దాన్ని చూసి అతని తల్లిదండ్రులకు రాత్రి 1.35కు ఫోన్‌ చేశారు. తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా అపార్టుమెంట్‌పై నుంచి దూకి విగతజీవిగా పడి ఉన్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని