logo

నేటి తరానికి రామాయణం తెలియజేయాలి

రామాయణ మహాకావ్యాన్ని, సారాంశాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరముందని సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు.

Published : 15 Apr 2024 02:16 IST

రవీంద్రభారతిలో ‘శ్రీ రామాయణ భానువు’ను ఆవిష్కరిస్తున్న కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, భానుప్రకాశ్‌, రావుల గిరిధర్‌, ఆకెళ్ల రాఘవేంద్ర, రావికంటి శ్రీనివాస్‌ తదితరులు

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: రామాయణ మహాకావ్యాన్ని, సారాంశాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరముందని సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. పద్య సారస్వత పీఠం ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ప్రముఖ కవి, అవధాని అవుసుల భానుప్రకాశ్‌ రచించిన ‘శ్రీ రామాయణ భానువు’ పద్యకావ్యాన్ని సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణకు ముందు ఉగాది వేడుకలు, 108 మంది కవులతో నిర్వహించిన కవి సమ్మేళనం ఆకట్టుకుంది. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, భార్యాభర్తలు, అన్నదమ్ముల మధ్య బాంధవ్యాలు ఎలా ఉండాలి? అని తెలుసుకునేందుకు రామాయణం చదవాలన్నారు. వ్యక్తిత్వ వికాసం, వ్యాపారదక్షత, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు రామాయణం దిక్సూచిగా నిలుస్తుందన్నారు. ఈ తరానికి అర్థమయ్యేందుకు వీలుగా సులభశైలిలో 108 పద్యాలతో రామాయణాన్ని రచించిన భానుప్రకాశ్‌ను పలువురు కవులు అభినందించారు. కార్యక్రమంలో ఈ-గురుకులం ఫర్‌ ఐఏఎస్‌ సంస్థ వ్యవస్థాపకులు ఆకెళ్ల రాఘవేంద్ర, సినీనటులు సీవీఎల్‌ నర్సింహారావు, తూర్పు మండలం డీసీపీ రావుల గిరిధర్‌, యువభారతి అధ్యక్షుడు ఆచార్య ఫణీంద్ర, సీనియర్‌ పాత్రికేయులు రావికంటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని