logo

సైనిక శిక్షణ నుంచి పారిపోయి వచ్చి..

యూనిఫాంపై గౌరవంతో రెండుసార్లు సైన్యంలో చేరి.. ఒకసారి అనారోగ్యం, మరోసారి పారిపోయి వచ్చిన ఓ యువకుడు నకిలీ పోలీసు అవతారం ఎత్తాడు. చివరికి కటకటాలపాలయ్యాడు.

Published : 15 Apr 2024 02:45 IST

పోలీసు అవతారం ఎత్తి కటకటాలపాలు

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: యూనిఫాంపై గౌరవంతో రెండుసార్లు సైన్యంలో చేరి.. ఒకసారి అనారోగ్యం, మరోసారి పారిపోయి వచ్చిన ఓ యువకుడు నకిలీ పోలీసు అవతారం ఎత్తాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. టాస్క్‌ఫోర్సు డీసీపీ రష్మీ పెరుమాల్‌ కథనం ప్రకారం... వనపర్తి జిల్లా, ఖిల్లా ఘనాపురం మండలం, దొంతికుంటకు చెందిన కదావత్‌ సోమ్లా నాయక్‌ కారు డ్రైవర్‌గా చేస్తూ బంజరాహిల్స్‌ రోడ్‌ నంబరు 11, ఉదయ్‌నగర్‌కాలనీలోని ఉంటున్నాడు. గతంలో ఆర్మీలో జనరల్‌ డ్యూటీ జవానుగా ఎంపికయ్యాడు. ఆరు నెలల శిక్షణ అనంతరం పారిపోయి ఇంటికి వచ్చాడు. 2004లో అస్సాం రైఫిల్‌లో ఎంపికై శిక్షణకు వెళ్లాడు. అనారోగ్యంతో రెండోసారి ఇంటి ముఖం పట్టాడు. పలుమార్లు పోలీసు రిక్రూట్‌మెంట్‌కు వెళ్లినా ఎంపిక కాలేదు. 2012 నుంచి కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా యూనిఫాం ధరించి బయటికి వెళ్లేవాడు. దీంతో సోమ్లా పోలీసుశాఖలో పనిచేస్తున్నట్లు స్థానికులను నమ్మించాడు. పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానని గౌరీశంకర్‌నగర్‌కు చెందిన యువకుడి నుంచి రూ.2లక్షలు వసూలు చేశాడు. ఇలా పలువురు నుంచి రూ.11లక్షలు దండుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మాసాబ్‌ట్యాంక్‌, ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద ఉన్న యూనిఫాం, బైక్‌, చరవాణి స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు