logo

ఏఐడీఎంకేను గెలిపించండి: అసదుద్దీన్‌

దేశంలో మజ్లిస్‌ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాల్సి ఉందని.. అందుకు తమిళనాడులో పార్టీ కార్యకర్తలను కలవలేకపోతున్నానని హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మంగళవారం ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Published : 17 Apr 2024 02:18 IST

అబిడ్స్‌, న్యూస్‌టుడే: దేశంలో మజ్లిస్‌ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాల్సి ఉందని.. అందుకు తమిళనాడులో పార్టీ కార్యకర్తలను కలవలేకపోతున్నానని హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మంగళవారం ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.  తమిళనాడులో ఏఐడీఎంకే అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఓట్లు వేసి గెలిపించాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. సిద్ధాంతపరంగా మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏఐడీఎంకేకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని