logo

రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ

ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి.

Published : 18 Apr 2024 03:35 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. ఆసుపత్రి, హోటల్‌ రంగాలకు చెందిన డీవీఎస్‌ సోమరాజు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 62లో ఉంటున్నాడు. ఈనెల 4న కుటుంబ సభ్యులంతా శుభకార్యానికి వెళ్లారు. డైమండ్‌ నెక్లెస్‌, చంద్రహారం, 185 గ్రా. 4 బంగారు బిస్కెట్లు, 100 గ్రా. బంగారు గాజులు అల్మారాలో భద్రపరిచారు. 15న రాత్రి చూడగా కనిపించలేదు. పక్కనే మరో 50 లక్షల విలువైన ఆభరణాలు అలాగే ఉన్నాయి. ఇంట్లో నలుగురు పనిమనుషులు ఉండగా ఇద్దరు ఇంటి ఆవరణలో, మరో ఇద్దరు బయటి నుంచి వస్తుంటారు. ఈ ఘటనపై సోమరాజు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీ అయినట్లు ఫిర్యాదు  చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని