logo

ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ తెలిపారు

Published : 18 Apr 2024 04:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ తెలిపారు. రూ.2,00,13,088 విలువైన ఇతర వస్తువులు, 20,441.89 లీటర్ల మద్యాన్ని సైతం పట్టుకున్నట్లు తెలిపారు. 185 మందిపై కేసులు నమోదు చేయగా 181 మందిని అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. నగదు, ఇతర వస్తువులపై 383 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని, 251 మందిపై ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేసినట్లు వెల్లడించారు. లైసెన్సు గల 2,842 ఆయుధాలను డిపాజిట్‌ చేసినట్లు తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై 5 ఫిర్యాదులు రాగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. * గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.28,28,000 నగదు రూ.4,72,161 విలువైన వస్తువులను పట్టుకుని స్వాధీనం చేసుకున్నామని, ఆబ్కారీ ద్వారా 243.61 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని, 8 కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. నగదు ఇతర వస్తువులపై 19 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని, 14 ఎఫ్‌.ఐ.ఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. 52 లైసెన్స్‌డ్‌ ఆయుధాలను డిపాజిట్‌ చేసినట్లు ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని