logo

వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే

రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని,  వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌ అన్నారు.

Published : 19 Apr 2024 03:04 IST

ప్రసంగిస్తున్న శైలజారామయ్యర్‌, వేదికపై సజ్జాద్‌షాహిద్‌, బాబ్జీ, భారతిహోలికేరి, అనురాధారెడ్డి

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని,  వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌ అన్నారు. ఉస్మానియా, ‘మను’ వంటి విశ్వవిద్యాలయాలు కూడా ముందుకు రావాలన్నారు. గురువారం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో ఇన్‌టాక్‌ సంస్థ సహకారంతో ‘ప్రపంచ వారసత్వ సంపద దినోత్సవం’ సందర్భంగా హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌లోని ఆర్కియాలజీ మ్యూజియంలోని భగవాన్‌ మహావీర్‌ ఆడిటోరియంలో ‘మాన్యుమెంటల్‌ హెరిటేజ్‌-ఇట్స్‌ ప్రొటెక్షన్‌ ఫర్‌ పోస్టిరిటీ’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) డిప్యూటీ సూపరింటెండెంట్‌, పురావస్తు పరిశోధకుడు సీహెచ్‌ బాబ్జీ రావు  మాట్లాడుతూ చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, వాటికి సంబంధించిన భూములు చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయన్నారు. ఇన్‌టాక్‌ కో-కన్వీనర్‌ సజ్జాద్‌ షాహిద్‌, కన్వీనర్‌ అనురాధారెడ్డి, పురావస్తు శాఖ డైరెక్టర్‌ భారతి హోలికేరి మాట్లాడారు. డిప్యూటీ డైరెక్టర్‌ నారాయణ వందన సమర్పణ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని